ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29 శాఖలకు గాను ఐదుగురే హాజరు * ఖాళీ కుర్చీలతో వేదిక కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల స్థాయి అధికారుల తీరు ప్రజావాణి ఉద్దేశాన్నే ప్రశ్నార్థకం చేస్తోందన్న విమర్శలు మండలవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సోమవారం ఉదయం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 29 శాఖలకు...