జూదం ఆడుతున్న 12 మంది అరెస్ట్..
జూదం ఆడుతున్న 12 మంది అరెస్ట్.. రూ.2.39 లక్షల నగదు, 12 మొబైల్ ఫోన్లు, పేకాట కార్డులు స్వాధీనం.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేకాట ఆడుతున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హనుమకొండలోని రెడ్డి కాలనీలో చోప్పదండి రంజిత్ నివాసంలో పేకాట జరుగుతున్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకుని వారి వద్ద నుండి రూ.2,39,660...