ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక
ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు సమన్వయంతో పనిచేయాలి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ఉత్సవాలు ప్రారంభం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఐనవోలు మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను...