వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొండ అర్జున్ ఈ వేడుకలో పాల్గొని స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తె మట్టెలను భక్తిశ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టం కన్నుల పండువగా సాగింది. ఈ శుభ సందర్భాన్ని వీక్షించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు....