సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొండాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. గత నాలుగు రోజులుగా కొనసాగిన వాలీబాల్‌, క్రికెట్ పోటీలు శుక్రవారం హోరాహోరిగా ముగిశాయి. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడంతో ఆటస్థలాలు క్రీడాభిమానులతో కిటకిటలాడాయి. వాలీబాల్ పోటీల్లో గ్రామ సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్‌తో కలిసి రామగిరి శ్యామ్ జట్టు అత్యుత్తమ ప్రతిభ...