నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం దేవుని గుట్టపై భక్తుల సందడి కాకతీయ, నెల్లికుదురు : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో దేవుని గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల మంత్రోచ్చారణలు, వేద మంత్రాల నడుమ కల్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని కొండపల్లి ప్రకాష్‌రావు–భారతీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించగా, వేదపండితులు కళ్లకుంట్ల శ్రీనివాసాచార్యులు, నిఖిల్ కృష్ణమాచార్యులు పర్యవేక్షించారు. కల్యాణ కర్తలుగా మామిండ్లపల్లి నర్సింహాచారి–శోభ దంపతులు, గ్రామ సర్పంచ్...