ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం
ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం సంగారెడ్డి ప్రజలకు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీ కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 2012–13లో ఇళ్ల పట్టాలు పొందినవారితో పాటు ఇప్పటికీ ఇంటి స్థలం లేని పేదలతో సంగారెడ్డి గంజ్ మైదాన్‌లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల ముఖా ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ… తాను 22 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే నివసించానని, అందుకే పేదలకు సొంత ఇంటి స్థలం ఉండాలనే బాధ...