బాల సదన్ నుంచి ఇద్దరు బాలికల దత్తత
బాల సదన్ నుంచి ఇద్దరు బాలికల దత్తత హైదరాబాద్ దంపతులకు అప్పగింత కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ బాల సదన్‌లో సంరక్షణలో ఉన్న ఇద్దరు బాలికలను (9, 12 సంవత్సరాలు) హైదరాబాద్కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం దత్తతగా అప్పగించారు. ఈ కార్యక్రమాన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లలు లేని దంపతులు దత్తతను తప్పనిసరిగా చట్టబద్ధ విధానంలోనే తీసుకోవాలని సూచించారు. అనాథ శిశువుల దత్తతతో పాటు రక్త సంబంధీకుల నుంచి దత్తత...