మున్సిపల్ “పోరు”కి సిద్ధం
మున్సిపల్ “పోరు”కి సిద్ధం కొత్తగూడెం కార్పోరేషన్‌కు తొలిపోరుకు రంగం సిద్ధం ఎస్టీ జనరల్‌కు మేయర్ పీఠం రిజర్వుడ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. డివిజన్లకు, మేయర్ స్థానానికి రిజర్వేషన్ల ఖరారుతో కార్పోరేషన్ ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే అన్ని పార్టీల లక్ష్యంగా మారింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల కారణంగా చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్, ఈసారి ఒంటరి పోరుతో బరిలోకి దిగాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర...