పొచమ్మకుంటలో హరివిల్లు

పొచమ్మకుంటలో హరివిల్లు రుద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన పేరం గోపికృష్ణ కాకతీయ, హనుమకొండ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జీడబ్ల్యూఎంసీ 54వ డివిజన్ పరిధిలోని పొచమ్మకుంట కాలనీలో రుద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు పండుగ సందడిని రెట్టింపు చేశాయి. కాలనీ అంతటా ముంగిళ్లు రంగురంగుల రంగవల్లులతో మెరిసిపోతూ హరివిల్లును తలపించాయి. మహిళలు సృజనాత్మకంగా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు కాలనీ పెద్దలు సంజీవ రెడ్డి, రంగారెడ్డి, కేశబోయిన మోహన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు....