ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి ఆకేరు పరివాహక ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆగ్రహం అభివృద్ధి–సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమంటూ స్ప‌ష్టం కాకతీయ, నర్సింహులపేట : అధికారులు ఇసుక దోపిడీని వెంటనే అరికట్టాలని డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆదేశించారు. మండల కేంద్రంలో శనివారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆకేరు పరివాహక ప్రాంతాలైన జయపురం, కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం గ్రామాల్లో...