విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి
విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి ఖమ్మంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ కాకతీయ, ఖమ్మం : పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు జనవరి 23, 24, 25 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరగనున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం పట్టణంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పీడీఎస్‌యూ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు....