గోశాలలకు దాణా పంపిణీ

గోశాలలకు దాణా పంపిణీ చొల్లంగి అమావాస్య సంద‌ర్భంగా స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం కాకతీయ, ఖమ్మం : పుష్యమాస చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని శ్రీ స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ గోశాలలకు గోదాణా వితరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నగర పెద్దలు, వ్యాపారులు, దాతల సహకారంతో సేకరించిన సుమారు రూ.69 వేల విరాళాలతో గొల్లగూడెం ఓం శ్రీకృష్ణ గోశాలకు రూ.46 వేలు, టేకులపల్లి శ్రీ వెంకటేశ్వర గోశాలకు రూ.13 వేలు అందించారు. అలాగే శ్రీ లక్ష్మి రంగనాధ స్వామి గోశాలకు...