ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాక‌తీయ‌, మ‌రిపెడ : మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఎల్లంపేట పాఠశాల 1992–93 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం మేడారంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడంతో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఆనందంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా ఎన్నికైన గండి రాధమ్మతో పాటు సర్పంచ్‌ అభ్యర్థిగా గెలుపొందిన జరుపుల కాలునాయక్‌ను సన్మానించారు. అలాగే విద్య, వైద్యం, సాఫ్ట్‌వేర్‌, ఆరోగ్యం, పత్రికారంగం, బ్యాంకింగ్‌ రంగాల్లో ప్రతిభ...