గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళిక అవసరం
గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళిక అవసరం పారదర్శక పాలనతోనే ఆదర్శ గ్రామాలు నూతన సర్పంచులకు శిక్షణలో కలెక్టర్ సత్యశారద కాకతీయ, గీసుగొండ : నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకొని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సూచించారు. దేశంలోనే ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన *గంగదేవిపల్లి*లో జిల్లాలోని 11 మండలాల నూతన సర్పంచుల కోసం నాలుగు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గీసుగొండ, సంగెం, చెన్నారావుపేట మండలాలకు చెందిన 84 మంది సర్పంచులు పాల్గొన్న...