మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : మహిళల చుట్టే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని, వారు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంఘం, మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గత రెండేళ్లకు గాను 553 మహిళా సంఘాలకు...