రంగనాయక గుట్టల్లో జాతర ఏర్పాట్లు ప్రారంభం

రంగనాయక గుట్టల్లో జాతర ఏర్పాట్లు ప్రారంభం సమ్మక్క–సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, హుజురాబాద్ : ఈనెల 28 నుంచి జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర ఉత్సవాల ఏర్పాట్లను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ప్రారంభించారు. పట్టణంలోని రంగనాయక గుట్టలలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను ఆయన జాతర కమిటీ సభ్యులతో కలిసి సందర్శించి జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు కండువాలు కప్పి ఏర్పాట్ల పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మకు బంగారం చెల్లించి మొక్కులు అప్పజెప్పారు....