మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ ఎనిమిది కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం వార్డుల వారీగా అభివృద్ధి పనులు న‌ర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ప‌నుల్లో వేగం పెంచిన ఎమ్మెల్యే పేటలో అభివృద్ధికి వరుస శంకుస్థాపనలు కాకతీయ, నర్సంపేట : పట్టణంలో అభివృద్ధి పనులకు ఊపొస్తోంది. నర్సంపేట పోలీస్ స్టేషన్ నుంచి నాగుర్లపల్లి మీదుగా మాదన్నపేట వరకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. గత కొంతకాలంగా ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో...