ఔదార్యం చాటుకున్న పదోతరగతి స్నేహితులు
ఔదార్యం చాటుకున్న పదోతరగతి స్నేహితులు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం రూ.15 వేల నగదు, క్వింటాల్ బియ్యం అందజేత కష్టసుఖాల్లో అండగా ఉంటామంటూ భరోసా కాకతీయ, ఆత్మకూరు : స్నేహం అంటే మాటలకే పరిమితం కాదని, అవసరమైన వేళ అండగా నిలవడమే అసలైన ఔదార్యమని పదోతరగతి స్నేహితులు మరోసారి నిరూపించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన షేక్ జాఫర్ కుటుంబానికి ఆయన కుమారుడి పదో తరగతి స్నేహితులు చేయూత అందించారు. 2014–2015 విద్యా సంవత్సరం పదోతరగతి బ్యాచ్‌కు చెందిన స్నేహితులు మంగళవారం ఆత్మకూరు మండల...