శాతవాహన ఫార్మసీ విభాగాధిపతిగా డా. క్రాంతిరాజు నియామకం
శాతవాహన ఫార్మసీ విభాగాధిపతిగా డా. క్రాంతిరాజు నియామకం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఉన్న విశ్వవిద్యాలయ బి.ఫార్మసీ కళాశాల విభాగాధిపతిగా డా. క్రాంతిరాజును నియమిస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపకులపతి ఆదేశాల మేరకు ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. డా. క్రాంతిరాజు 2013లో శాతవాహన విశ్వవిద్యాలయంలో ఫార్మసీ విభాగంలో చేరి బోధనా బాధ్యతలతో పాటు పరిశోధన రంగంలోనూ విశేష సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు మూడు పేటెంట్లు నమోదు చేయడంతో...