50 కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
50 కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కాకతీయ, జూలూరుపాడు: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు జూలూరుపాడు మండలంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు భూక్యా రమేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా భూక్యా రమేష్ మాట్లాడుతూ, మండల పరిధిలోని పడమట నర్సాపురం, దండుమిట్ట తండా, కొమ్ముగూడెం, బేతలపాడు, మచినేనిపేట గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలకు ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు....