అనారోగ్యంతో సర్పంచ్ తులసిరామ్ కన్నుమూత
అనారోగ్యంతో సర్పంచ్ తులసిరామ్ కన్నుమూత నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలంలోని బోటి తండాకు చెందిన నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ భూక్యా తులసిరామ్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ బోటి తండాకు చేరుకొని తులసిరామ్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న సమయంలోనే...