బిల్లుల కోసం పాఠశాలకు తాళం
బిల్లుల కోసం పాఠశాలకు తాళం పనులు చేసి అప్పుల పాలయ్యామని కాంట్రాక్టర్ ఆవేదన రెండేళ్లుగా చెల్లింపులు లేవని నిరసన చిన్నవంగర గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఘటన కాకతీయ, పెద్దవంగర : అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి పనులు చేపడితే, రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్ బుధవారం నిరసనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామ ప్రభుత్వ పాఠశాల ఎంట్రన్స్ గేటుకు తాళం వేశారు. 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ‘మన ఊరు–మన బడి’ పథకం కింద పాఠశాల మరమ్మతుల...