గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ
గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ములుగు :ములుగు జిల్లా ములుగు మండలం దేవగిరి పట్టణంలోని *మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల*లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీలత మాట్లాడుతూ, ఐదో తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఐదో తరగతిలో మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉండగా, వాటిలో 51 సీట్లు ముస్లిం మైనారిటీలకు, 5...