రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు
రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు కాకతీయ, రాయపర్తి : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను తూచా తప్పకుండా పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య స్పష్టం చేశారు. గురువారం రాయపర్తి ప్రయాణ ప్రాంగణం సమీపంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం అంటే కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడం కాదని, అది మన ప్రాణాలను...