సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయం వసంత పంచమి మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరగనున్న వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామివారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణతో అలంకరించారు. వసంత పంచమి సందర్భంగా ఉదయం 4 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ...