పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు గుడుంబా త‌యారీకి త‌ర‌లుతున్న బెల్లం జాతర ముసుగులో అక్రమ అమ్మకాల జోరు అటకెక్కిన అధికారుల పర్యవేక్షణ నర్సంపేటలో బట్టబయలైన నిర్లక్ష్యం కాకతీయ, నర్సంపేట : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అనాదిగా తెల్ల బెల్లం (బంగారం)ను మొక్కులుగా సమర్పించే ఆచారం కొనసాగుతోంది. ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా టన్నుల కొద్దీ బెల్లం అమ్మవార్లకు సమర్పిస్తారు. అయితే ఇదే అదునుగా కొందరు వ్యాపారులు దేవుడి పేరుతో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అక్రమంగా విక్రయిస్తూ అదనపు ఆదాయానికి తెరలేపినట్లు ఆరోపణలు...