మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం
మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన ఘటన భక్తుడికి గాయాలు… ఆసుపత్రికి తరలింపు విషయం బయటకు రాకుండా మంత్రాంగం? కాకతీయ, మేడారం : మేడారంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. జాతర ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ నేమ్‌బోర్డు ఒక్కసారిగా కిందపడటంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక భక్తుడు గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని జాతరలో చర్చ...