ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–II ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పెద్దూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఆరిగకూటి శ్రీనివాసరెడ్డి మరియు ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. యువత రాజకీయ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని...