ఆ కథనం అసత్యం
ఆ కథనం అసత్యం కొమ్మాల ఆలయంలో అవకతవకల్లేవు నిబంధనల ప్రకారమే వేతనాలు, ఖర్చులు ఓ పత్రికలో కథనం రావడంతో ధర్మకర్త స్పష్టీకరణ కాకతీయ, గీసుగొండ: కొమ్మాల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవని దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు స్పష్టం చేశారు. ఆలయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఓ పత్రికలో అసత్య కథనం ప్రచురించారని పేర్కొన్నారు. దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెలా చెక్కు ద్వారానే వేతనాలు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి బకాయిలు లేవని తెలిపారు. నిత్య నివేదనల కోసం అర్చకులు...