జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ
జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ మునిగిపోతున్న ముగ్గురిని రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్నవాగులో జరిగిన ప్రమాదంలో మునిగిపోతున్న ముగ్గురిని రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) 5వ బెటాలియన్ సిబ్బంది, తెలంగాణ ప్రత్యేక పోలీస్ బలగాలు రక్షించాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భూపాలపల్లి జిల్లాకు చెందిన మేకల జంపయ్య (36), మేకల సరిత (14), మేకల శిరీష (13) అకస్మాత్తుగా లోతైన నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత...