స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవం కాకతీయ,ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పండితులు చిన్నారులతో కలిసి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు మంగళకరంగా నిర్వహించి అనంతరం చిన్నారులకు అక్షరాలు దిద్దించి అక్షరాభ్యాస క్రతువును జరిపారు. చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడంతో పాఠశాల పరిసరాలు ఆధ్యాత్మిక శోభను...