సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు
సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు కాకతీయ, కరీంనగర్ : సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరను ఘనంగా నిర్వహించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. శనివారం రేకుర్తిలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కింగ్ స్థలాల చదును, తాత్కాలిక మరుగుదొడ్లు, దుకాణ సముదాయాల కోసం కేటాయించిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ...