మేడారం జాతరకు మచ్చ పడేనా..?

మేడారం జాతరకు మచ్చ పడేనా..? జంపన్న వాగు లెవలింగ్ పనులపై అనుమానాలు జాతరకు ముందే వాగులో ప్ర‌మాద ఘంటిక‌లు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా?.. భక్తుల భద్రతపై త‌లెత్తుతున్న‌ ప్రశ్నలు కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026ను ఈ నెల 28 నుంచి 31 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల నిధులతో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా...