ఆటలతోనే ఆరోగ్యానికి బలం
ఆటలతోనే ఆరోగ్యానికి బలం వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాకతీయ, కారెపల్లి : ఆటలు ఆడితేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, క్రీడలతో శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక దృఢత్వం కూడా పెరుగుతుందని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని తోడీతలగూడెం గ్రామంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తోడీతలగూడెం గ్రామ సర్పంచ్ బానోత్ ప్రియాంక కుమార్ ఆధ్వర్యంలో నాలుగు మండలాల స్థాయిలో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు....