కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం రెండు రోజుల గాలింపు తర్వాత విషాదాంతం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంపేట్ గ్రామానికి చెందిన సాదుల అనిల్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతై మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. పొలం పనులు ముగించుకుని గ్రామ పరిధిలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో స్నానానికి వెళ్లిన అనిల్ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా,...