ప్రశ్నించే గొంతుకగా ‘కాకతీయ’

ప్రశ్నించే గొంతుకగా ‘కాకతీయ’ ప్రజా సమస్యలపై ధైర్యమైన కథనాలు ప్రశంసనీయం 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాకతీయ, రామకృష్ణాపూర్ : అనతి కాలంలోనే ప్రశ్నించే గొంతుకగా కాకతీయ తెలుగు దినపత్రిక అగ్రగామిగా నిలిచిందని చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకతీయ తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై కాకతీయ అందిస్తున్న కథనాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయని...