చంద్రు తండకు చేరుకున్న పగిడిద్దరాజు

చంద్రు తండకు చేరుకున్న పగిడిద్దరాజు కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగాల–పూనుగొండ్ల నుంచి బయలుదేరిన శ్రీ మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు పయనం కొనసాగుతోంది. గురువారం గోవిందరావుపేట మండలంలోని చంద్రు తండకు పగిడిద్దరాజు చేరుకున్నారు. సాంప్రదాయ పూజలు, గిరిజన ఆచారాల మధ్య పగిడిద్దరాజు ప్రయాణం భక్తిశ్రద్ధలతో సాగుతోంది. దేవునితో పాటు పూజారులు పిడక రాజేశ్వర్, వెనక రాజేశ్వర్, పెనుక రామస్వామి, పెనుక సురేందర్, పెనుక వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మార్గమంతా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి...