గద్దెలపైకి వనదేవతలు.. గాల్లోకి ఎగురుతున్న నాటుకోళ్లు
గద్దెలపైకి వనదేవతలు.. గాల్లోకి ఎగురుతున్న నాటుకోళ్లు ఆదివాసీ విశ్వాసానికి ప్రతీకగా ఎదురుకోళ్ల సంప్రదాయం కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో నాటుకోళ్ల ‘ఎదురుకోళ్ల’ మొక్కులు అత్యంత విశిష్టమైన ఆదివాసీ సంప్రదాయంగా నిలుస్తున్నాయి. వనదేవతలు గద్దెలపైకి వచ్చే వేళ భక్తులు తమ భక్తిని చాటుకునే ఈ ఆచారం మేడారం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సారలమ్మ, సమ్మక్క తల్లులు గద్దెపైకి చేరుకునే క్షణాల్లో వేలాది మంది భక్తులు నాటుకోళ్లతో గద్దెల వైపు పరుగులు తీస్తూ ఎదురుకోళ్లు ఇస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎదురుకోళ్ల మొక్కు...