మేడారంలో ఉద్విగ్నం
మేడారంలో ఉద్విగ్నం తల్లి రాక కోసం జంపన్నవాగు వద్ద లక్షల మంది ఎదురుచూపులు పూనకాలతో హోరెత్తుతున్న మేడారం..! కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతర తొలి రోజైన బుధవారం రాత్రి వేళ మేడారం అరణ్యం ఉత్కంఠభరిత వాతావరణంతో ఉప్పొంగిపోయింది. గంట గంటకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అడవీ మార్గాలన్నీ జనసంద్రంగా మారాయి. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వాహనాలతో పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. ఎటుచూసినా భక్తజన సందడి తప్ప మరో దృశ్యం కనిపించని పరిస్థితి నెలకొంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ (సారక్క)...