మేడారం మార్గంలో విషాదం..!
మేడారం మార్గంలో విషాదం..! ట్రాక్టర్ బోల్తా.. తల్లీకూతుళ్ల దుర్మరణం 17 మందికి పైగా గాయాలు.. మహముత్తారం పెద్దవాగు వద్ద ప్రమాదం కాకతీయ, భూపాలపల్లి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహాముత్తారం మండలం బోర్లగూడెం (పెగడపల్లి) గ్రామ సమీపంలోని పెద్దవాగు వద్ద బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17 మందికి పైగా గాయపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన...