లాంఛనాల మధ్య గద్దెపైకి సమ్మక్క
లాంఛనాల మధ్య గద్దెపైకి సమ్మక్క అగ్రం పహాడ్‌కు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం గాల్లోకి కాల్పులు జరిపిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కాకతీయ, ఆత్మకూరు : కొంగుబంగారమైన వనదేవత సమ్మక్క ఆగమనంతో అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర భక్తి పారవశ్యంతో ఉప్పొంగింది. తెలంగాణలోనే ‘రెండో మేడారం’గా పేరొందిన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్‌లో జాతర వేళ జనసంద్రం వెల్లువెత్తింది. జిల్లాలకే కాదు.. రాష్ట్రాలు దాటి కుటుంబ సమేతంగా భక్తులు తరలిరావడంతో గ్రామం జనారణ్యంగా మారింది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో వనదేవతలను దర్శించుకుంటే...