మేడారం జాతరలో మగబిడ్డ జననం

మేడారం జాతరలో మగబిడ్డ జననం తల్లీ–బిడ్డాక్షేమం.. జాత‌ర‌లో పుట్ట‌డంతో కుటుంబ స‌భ్యుల్లో ఆనందం కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఓ గర్భిణీ సురక్షితంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈసంఘటన భక్తులను ఆనందానికి గురి చేసింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మౌలాలి గాంధీనగర్‌కు చెందిన రజిత అనే గర్భిణీ కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంది. దర్శనం పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో రజితకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి....