జమ్మికుంటలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం

జమ్మికుంటలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట శివారులోని కాకతీయ పాఠశాల వెనుక చెరువు మత్తడి వాగులో గుర్తుతెలియని యువకుని మృతదేహం లభ్యమైంది. గురువారం మధ్యాహ్నం మేకలు మేపుతున్న ఎండి సల్మాన్ శవాన్ని గుర్తించి మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా, మృతుడు 35–40 ఏళ్ల వయస్సు ఉండి, ఆరు రోజుల క్రితమే మృతి చెందినట్లు, శవం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణ...