వనం నుంచి జనంలోకి సమ్మక్క.. మేడారంలో కీలక ఘట్టం
వనం నుంచి జనంలోకి సమ్మక్క.. మేడారంలో కీలక ఘట్టం కాకతీయ, మేడారం బృందం : మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి వనం విడిచి భక్తజనంలోకి అడుగుపెట్టిన క్షణం మేడారం అడవులు భక్తి పారవశ్యంతో మారుమోగాయి. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం ప్రారంభమవడంతో లక్షలాది భక్తులు ఉత్కంఠగా ఎదురుచూసిన అపూర్వ ఘడియ సాకారమైంది. చిలకలగుట్టపై సంప్రదాయ పూజలు పూర్తైన అనంతరం, పూజారులు సమ్మక్క తల్లి కుంకుమ భరిణెను తీసుకుని మేడారం గద్దెల దిశగా ప్రయాణం ప్రారంభించారు....