‘డ్రగ్స్‌తో జీవితం మసి… మానేస్తే జీవితం ఖుషి’
‘డ్రగ్స్‌తో జీవితం మసి… మానేస్తే జీవితం ఖుషి’ మేడారం జాతరలో వినూత్నంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రచారం కాకతీయ, మేడారం బృందం : నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న తరుణంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో డ్రగ్స్, గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తూ భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మెడలో గవ్వల దండలు, తలపై...