సమ్మక్క–సారలమ్మను దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సమ్మక్క–సారలమ్మను దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తగట్టులో మత్స్యగిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో సమ్మక్క–సారలమ్మ అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వనదేవతల ఆశీర్వాదంతో రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురిసి, పాడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు...