గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క

గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క వనం వీడి జనంలోకి వచ్చిన వనదేవతలు ఆర్కే–వన్‌లో జన సంద్రోహం… భక్తుల పోటెత్తు కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రతి రెండేళ్లకోసారి సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతర ఈసారి కూడా వైభవంగా కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు అవసరమైన ఏర్పాట్లను సింగరేణి యాజమాన్యం సమకూర్చింది. ఆర్కే–వన్ పాలవాగు సమీపంలో ఏర్పాటు చేసిన గద్దెలపై బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. మందమర్రి నుంచి డప్పు చప్పులతో సమ్మక్క తల్లిని తీసుకురాగా, గద్దెల వద్ద భక్తుల జయజయధ్వానాలతో...