గద్దెకు చేరిన సమ్మక్క తల్లీ..!
గద్దెకు చేరిన సమ్మక్క తల్లీ..! కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టను విడిచి సంప్రదాయబద్ధంగా జనంలోకి వచ్చిన సమ్మక్క తల్లి చివరకు గద్దెపైకి చేరుకోవడంతో భక్తులు పారవశ్యంతో పరవశించి పోయారు. ఈ పవిత్ర క్షణాన్ని కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అడుగడుగునా “జయ జయ సమ్మక్క” నామస్మరణతో వనం దద్దరిల్లింది. చిలుకల గుట్ట వద్ద సంప్రదాయ పూజల అనంతరం పూజారులు కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లిని తీసుకువచ్చారు. మార్గమంతా శివసత్తుల...