వ‌న దేవ‌త‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల మొక్కులు

వ‌న దేవ‌త‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల మొక్కులు మేడారంలో జిష్ణుదేవ్‌కు ఘ‌న స్వాగ‌తం స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు.. ఎత్తు బంగారం జాత‌ర ఏర్పాట్ల‌పై అధికారుల‌తో చ‌ర్చ‌లు భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ మేడారం వన దేవతల‌ను ద‌ర్శించుకున్నారు. శుక్ర‌వారం సమ్మక్క–సారలమ్మను సతీస‌మేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తులాభారం నిర్వహించి, అమ్మవార్లకి బంగారం సమర్పించారు. ముందుగా గవర్నర్‌కు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ ఘనంగా స్వాగతం పలికారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని...